పిల్లలు ప్రకోపానికి (పట్ట లేని కోపం) ఎందుకు గురవుతారు, అప్పుడు మీరు ఏమి చెయ్యాలి?
- పిల్లల్లో ప్రకోపం రెండు విధాలు గా వుంటుంది - ఒకటి వాళ్ళు కావాలని చేసేది, రెండు వాళ్ళకి తెలియకుండా జరిగేది.
- వాళ్ళు కావాలని చేసినప్పుడు ఎదో కోరి చేస్తారు, అటువంటప్పుడు మనం వారు కోరింది ఇస్తే వాళ్ళు ఇదే తరహా లో మళ్ళీ చెయ్యడం మొదలు పెడతారు. అందుకు మనం ఈ విషయంలో అస్సలు రాజీ పడకూడదు. వాళ్ళని కూర్చోబెట్టి తను ఏదైతే కోరి ఇలా చేస్తున్నారో అది మీకు అర్ధమవుతుంది అని, వాళ్ళు ఈ విధంగా ప్రవర్తించడం మీకు నచ్చట్లేదు అని, దీని వల్ల వాళ్ళకి నచ్చే విషయాలు వాళ్ళు కోల్పోతారు అని చెప్పాలి.
- వాళ్ళకి తెలియకుండా జరిగినప్పుడు వాళ్ళని దగ్గరకి తీసుకుని భుజ్జగించాలి. వాళ్ళు ప్రశాంత పడ్డాకే వారి ప్రవర్తన గురించి మాట్లాడాలి. వాళ్ళు ఏ విషయం వల్ల అలా ప్రవర్తించారో, ఆ విషయం లో వారు ఏమి కోరుకుంటున్నారో అడిగి తెలుసుకోవాలి. అలాగే ఒకవేళ వాళ్ళకి నచ్చని పని ఎమన్నా అవుతుంటే దాన్ని ఆపడానికి వాళ్ళు ఎలా వ్యవహరించాలో చెప్పాలి. దీనితో పాటు ఆ నచ్చని పని వాళ్ళకి నచ్చే విదంగా చెయ్యాలంటే ఏం చెయ్యాలో అది కూడా చర్చించాలి. వచ్చే సారి ఆ విధంగానే చెయ్యాలి.
Comments
Post a Comment