మీరు వద్దు అంటే వాళ్ళూ వద్దు అంటారు
- మనం చాలా సందర్బాలలో పిల్లల్ని వద్దు ఇది చెయ్యకూడదు అది చెయ్యకూడదు అని అంటుంటాం. అలా మనం వద్దు అనే పదం ఎంతగా వాడుతున్నామో మనకే తెలియదు. ఇలా చేస్తున్నప్పుడు పిల్లలు ఈ వద్దు అనే పదాన్ని విని అది చాలా ప్రాముఖ్యత కల్గిన పదం గా భావించి దాన్ని వాడడం మొదలుపెడతారు.
- వాళ్ళు ఏ విషయంలోనైనా గజిబిజి పడ్డప్పుడు అలాగే ఇష్టం లేనప్పుడు వద్దు అని చెప్పడం మొదలుపెడతారు. కొన్ని సార్లు ఐతే కావలి అని అనిపించినప్పటికి వద్దు అని అంటారు.
- మీ పిల్లలు అలా వద్దు వాడడం తగ్గించాలి అంటే మొదటిగా మనం ఆ మాట వాడడం తగ్గించాలి.
Comments
Post a Comment