పిల్లలు వేరే పిల్లల్ని కొట్టడం ఎలా ఆపించాలి?
- పిల్లలు మన దృష్టి వాళ్ళ మై మళ్ళించుకోవడానికి వాదించడం, పేచి పెట్టడం, క్రింద పడి దొర్లడం, పిచ్చిగా గొంతులు వెయ్యడం, అరవడం, మురికి చేసుకోవడం, వేరే పిల్లల్ని కొట్టడం లాంటివి చేస్తారు.
- ఐతే వాళ్ళు చేస్తుంది హాని కలిగించని పని ఐతే మనం వారిని పట్టించుకోకపోతే మెల్లగా వాళ్ళే ఆ పనులు ఆపేస్తారు.
- వేరే పిల్లల్ని కొట్టడం హాని కలిగించే పని - ఈ విషయంలో తక్షణమే చర్యలు తీసుకోవాలి. వారిని తిట్టడం కొట్టడం కాకుండా, ఎవరినైతే కొడుతున్నారో వారిని ఓదార్చడం, లేదంటే మన పిల్లల దృష్టి వేరేదానిపై మళ్ళించడం చెయ్యొచ్చు.
- వాళ్ళు మీరు చర్యలు తీసుకున్నా కొట్టడం ఆపకపోతే అప్పుడు వాళ్ళ చేతులు దగ్గరికి తీసుకుని, వారితో వేరే పిల్లల్ని కొట్టకూడదు అని చెప్పి, వారితో చెప్పించాలి కూడా. వారు మీరు చెప్పింది జీర్ణించుకునే వరకు అలాగే ఉండండి. దీనితో పాటు వాళ్ళు మళ్ళీ కొడితే ఏమి అవుతుందో అది కూడా చర్చించండి.
- మళ్ళీ వాళ్ళు కొడితే మీరు ఏమైతే అవుతుంది అని చెప్పారో అది తప్పక చెయ్యండి.
- తర్వాత వాళ్ళతో దీని గురించి మాట్లాడి పిల్లల్ని కొట్టకూడదు అనే విషయం బాగా అర్ధం అయ్యిందో లేదో తెలుసుకోండి. అర్ధం అయ్యేలా చెప్పండి.
Comments
Post a Comment