చిన్న పిల్లల్కి టైం టేబుల్ ఉండాలా?


  • మనం చిన్న పిల్లల్కి టైం టేబుల్ ఏంటీ అని అనుకుంటాం - కాని వాళ్ళకి ఆ వయసు నుండి టైం ప్రకారం పనులు చెయ్యడం అలవాటు చేస్తే పెద్దయ్యాక దాన్ని ఫాలో అవ్వడం చాలా సులువు అవుతుంది.
  • ఐతే మనలో చాలా పేరెంట్స్ పిల్లల్కి సంబందించిన అన్ని పనులు వాళ్ళే చేసేస్తారు - దీని వల్ల పేరెంట్స్ కి ఒత్తిడి పెరుగుతోంది అలాగే పిల్లలు నేర్చుకునే పరిస్థితి వుండదు.
  • దీనికి బదులు పిల్లల పనులు వాళ్ళే చేసుకునేలా అలవాటు చెయ్యాలి. రోజు వాళ్ళకి చప్పిన పనులు టైం ప్రకారం చేస్తే వాళ్ళకి చిన్న చిన్న బహుమతులు ఇచ్చి ప్రేరేపించోచ్చు. 
  • వాళ్ళు ఒక రోజంతా సక్రమంగా వుంటే వాళ్ళని పార్క్ కి తీసుకువల్లడం లాంటివి చెయ్యొచ్చు.
  • అదే రెండు మూడు రోజులు క్రమంగా పనులు చేస్తూ, మంచి ప్రవర్తనను చూపించినట్టైతే వాళ్ళని బీచ్ కొ, షికారు కొ, జూ కొ, వాళ్ళకు నచ్చిన ప్రదేశానికో తీసుకొని వెళ్ళొచ్చు.
  • ఐతే ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఎంటంటే మీరు ఆ బహుమతులు ఎందుకు ఇస్తున్నారో లేక ఆ ప్రదేశానికి ఎందుకు తీసుకు వచ్చారో స్పష్టంగా చెప్పడం. వాళ్ళు వాళ్ళ పనులు సక్రమంగా చెయ్యడం వల్లే వాళ్ళకి అవి  లభించాయి అని వాళ్ళకి తెలియాలి.

Comments

Popular posts from this blog

ఆచార వ్యవహారం (ఎటికెట్) టిప్స్ - మొబైల్ ఫోన్ / సెల్ ఫోన్ - 1

మీరు వద్దు అంటే వాళ్ళూ వద్దు అంటారు

పిల్లల్తో క్లిష్ట పరిస్థితులను ఎలా తప్పించుకోవచ్చు?