ఆచార వ్యవహారం (ఎటికెట్) టిప్స్ - మొబైల్ ఫోన్ / సెల్ ఫోన్ - 1
- ప్రశాంత ప్రదేశాల్లో మొబైల్ ని నార్మల్ మోడ్ లో పెట్టడం వల్ల మీకు ఎమన్నా కాల్ వస్తే మీకూ ఇబ్బందే అందరికీ ఇబ్బందే, అందుకని అటువంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మొబైల్ ని వైబ్రేషన్ లేదా సైలెంట్ మోడ్ లో పెట్టండి. ఒక వేళ అలా ఎలా పెట్టాలో తెలియకపోతే నేర్చుకోండి.
- కొంత మందికి ఫోన్ లో గెట్టిగా మాట్లాడే అలవాటు వుంటుంది. ఫోన్ లో మాట్లాడినప్పుడు మెల్లగా మాట్లాడాలి. నిజంగా గెట్టిగా మాట్లాడడం అవసరం అయితే ఎవరికీ ఇబ్బంది కలిగించని ప్రదేశానికి వెళ్లి మాట్లాడండి.

Comments
Post a Comment