Posts

Showing posts from April, 2019

Should small children have a time table?

We often think small children esp. toddlers need not have a time table. However, it is the right age to make them follow time and do works in time. If they learn it when they are young it becomes easy for them to follow later on. Many parents do this, but the wrong way - they do all works themselves. This increases stress in them and also takes away the opportunity from children to learn to do their things on their own. The right way of doing it is to teach them how to do their works. When they do their works on their own in time, appreciate them by rewarding small gifts or giving stars. If they do their works all in time on a particular day, you can take them to a park as a reward. If suppose they continuously do their works in time and also show proper behaviour then you can take them to beach or bigger park or picnic or to a place they like. Remember that whatever be the reward, explain clearly why they got it. The should realize that they are getting the rewards because of ...

చిన్న పిల్లల్కి టైం టేబుల్ ఉండాలా?

మనం చిన్న పిల్లల్కి టైం టేబుల్ ఏంటీ అని అనుకుంటాం - కాని వాళ్ళకి ఆ వయసు నుండి టైం ప్రకారం పనులు చెయ్యడం అలవాటు చేస్తే పెద్దయ్యాక దాన్ని ఫాలో అవ్వడం చాలా సులువు అవుతుంది. ఐతే మనలో చాలా పేరెంట్స్ పిల్లల్కి సంబందించిన అన్ని పనులు వాళ్ళే చేసేస్తారు - దీని వల్ల పేరెంట్స్ కి ఒత్తిడి పెరుగుతోంది అలాగే పిల్లలు నేర్చుకునే పరిస్థితి వుండదు. దీనికి బదులు పిల్లల పనులు వాళ్ళే చేసుకునేలా అలవాటు చెయ్యాలి. రోజు వాళ్ళకి చప్పిన పనులు టైం ప్రకారం చేస్తే వాళ్ళకి చిన్న చిన్న బహుమతులు ఇచ్చి ప్రేరేపించోచ్చు.  వాళ్ళు ఒక రోజంతా సక్రమంగా వుంటే వాళ్ళని పార్క్ కి తీసుకువల్లడం లాంటివి చెయ్యొచ్చు. అదే రెండు మూడు రోజులు క్రమంగా పనులు చేస్తూ, మంచి ప్రవర్తనను చూపించినట్టైతే వాళ్ళని బీచ్ కొ, షికారు కొ, జూ కొ, వాళ్ళకు నచ్చిన ప్రదేశానికో తీసుకొని వెళ్ళొచ్చు. ఐతే ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఎంటంటే మీరు ఆ బహుమతులు ఎందుకు ఇస్తున్నారో లేక ఆ ప్రదేశానికి ఎందుకు తీసుకు వచ్చారో స్పష్టంగా చెప్పడం. వాళ్ళు వాళ్ళ పనులు సక్రమంగా చెయ్యడం వల్లే వాళ్ళకి అవి  లభించాయి అని వాళ్ళకి తెలియాలి.

How to stop children from hitting other children?

To attract our attention children do many things like arguing, shouting loudly, fidgeting, crying out loud, getting dirty, hitting other children etc. If what they are doing is not harmful for anyone, just ignoring it will evnentually stop them from doing it, as the attention they are seeking, they are not getting it through that method. However, if what they are doing is harmful like hitting other children, we have to take steps immediately - instead of scolding or getting angry with our child we can soothe the child who is being hit or divert our child’s attention to some thing else. If our child continues to hit other children even after our initiatil attempts to prevent, take him near to you, in a serious note tell child that we should not hit other children - take some time until it is accepted by you child. If possible, make him tell that. Also mutually decide upon a consequence he will face if it is repeated. If child repeats again, make sure it is followed by the consequ...

పిల్లలు వేరే పిల్లల్ని కొట్టడం ఎలా ఆపించాలి?

పిల్లలు మన దృష్టి వాళ్ళ మై మళ్ళించుకోవడానికి వాదించడం, పేచి పెట్టడం, క్రింద పడి దొర్లడం, పిచ్చిగా గొంతులు వెయ్యడం, అరవడం, మురికి చేసుకోవడం, వేరే పిల్లల్ని కొట్టడం లాంటివి చేస్తారు. ఐతే వాళ్ళు చేస్తుంది హాని కలిగించని పని ఐతే మనం వారిని పట్టించుకోకపోతే మెల్లగా వాళ్ళే ఆ పనులు ఆపేస్తారు. వేరే పిల్లల్ని కొట్టడం హాని కలిగించే పని - ఈ విషయంలో తక్షణమే చర్యలు తీసుకోవాలి. వారిని తిట్టడం కొట్టడం కాకుండా, ఎవరినైతే కొడుతున్నారో వారిని ఓదార్చడం, లేదంటే మన పిల్లల దృష్టి వేరేదానిపై మళ్ళించడం చెయ్యొచ్చు. వాళ్ళు మీరు చర్యలు తీసుకున్నా కొట్టడం ఆపకపోతే అప్పుడు వాళ్ళ చేతులు దగ్గరికి తీసుకుని, వారితో వేరే పిల్లల్ని కొట్టకూడదు అని చెప్పి, వారితో చెప్పించాలి కూడా. వారు మీరు చెప్పింది జీర్ణించుకునే వరకు అలాగే ఉండండి. దీనితో పాటు వాళ్ళు మళ్ళీ కొడితే ఏమి అవుతుందో అది కూడా చర్చించండి. మళ్ళీ వాళ్ళు కొడితే మీరు ఏమైతే అవుతుంది అని చెప్పారో అది తప్పక చెయ్యండి. తర్వాత వాళ్ళతో దీని గురించి మాట్లాడి పిల్లల్ని కొట్టకూడదు అనే విషయం బాగా అర్ధం అయ్యిందో లేదో తెలుసుకోండి. అర్ధం అయ్యేలా చెప్పండి.

పిల్లల్ని వేరే వారితో పోల్చకండి

మన పిల్లల్ని వేరే వారితో పోల్చినప్పుడు వారికి విశ్వాసం లోపిస్తుంది. తమలో లోపం వుందని వారు నిరాశ చెందుతారు. అలాగే మీరు ఎవరితో ఐతే పోలుస్తారో వారిపై అసూయ పెంచుకునే అవకాశం వుంది. మీరు వారికంటే, మీరు ఎవరితో ఐతే పోలుస్తున్నరో, వారినే ఎక్కువగా ప్రేమిస్తున్నారు అనే భావన కూడా ఏర్పడవచ్చు. ఇలా చేయడం కంటే వాళ్ళలో వున్న మంచి విషయాలను ప్రేరేపించండి, దాని వల్ల వాళ్ళకి ప్రోత్సాహం లభిస్తుంది. అలాగే వారు ఒక సంతృప్తికరమైన జీవితాన్ని ఆస్వాదిస్తారు, ఎటువంటి ఒత్తిడికి లోనవ్వరు.

మీరు వద్దు అంటే వాళ్ళూ వద్దు అంటారు

మనం చాలా సందర్బాలలో పిల్లల్ని వద్దు ఇది చెయ్యకూడదు అది చెయ్యకూడదు అని అంటుంటాం. అలా మనం వద్దు అనే పదం ఎంతగా వాడుతున్నామో మనకే తెలియదు. ఇలా చేస్తున్నప్పుడు పిల్లలు ఈ వద్దు అనే పదాన్ని విని అది చాలా ప్రాముఖ్యత కల్గిన పదం గా భావించి దాన్ని వాడడం మొదలుపెడతారు. వాళ్ళు ఏ విషయంలోనైనా గజిబిజి పడ్డప్పుడు అలాగే ఇష్టం లేనప్పుడు వద్దు అని చెప్పడం మొదలుపెడతారు. కొన్ని సార్లు ఐతే కావలి అని అనిపించినప్పటికి వద్దు అని అంటారు. మీ పిల్లలు అలా వద్దు వాడడం తగ్గించాలి అంటే మొదటిగా మనం ఆ మాట వాడడం తగ్గించాలి.

మీ ప్రవర్తన మీ మాటలకంటే బలమైనది

మనం పిల్లల్కి ఇలా వుండాలి అలా వుండాలి అని చెబుతాం. వాస్తవానికి మనలో చాలా మంది మనం చెప్పేవి పాటించం. ఇవి పిల్లలు ఇట్టే పసిగడతారు. వాళ్ళు మనం చెప్పే మాటల కంటే మన ప్రవర్తన నుంచే ఎక్కువగా నేర్చుకుంటారు. అందువల్ల మనం వారికి ఎమన్నా చెప్పే ముంది మనం అది అలవర్చుకోవాలి. అందుకే ఏ తల్లిదండ్రులు ఐతే కోపం, మొండితనం, కొట్టడం, తిట్టడం వంటివి చేస్తారో వారి పిల్లలు కూడా అలానే చేస్తుంటారు. ఇలా చెయ్యడం వళ్ళ మీ పిల్లలు మంచి పౌరులుగా మారారు అంతేగాక ఒకటి చెప్పి ఇంకోటి చెయ్యొచ్చు అనే అలవాటుకి లోబడే అవకాశం కూడా వుంది.

మీ ఇంట్లో బాస్ మీరా మీ పిల్లలా?

మనం మన పిల్లల్ని కంట్రోల్ చెయ్యడానికి వాళ్ళకి రోజు బోల్లేడు ఆర్డర్లు ఇస్తుంటాం. పిల్లలు అలా ఆర్డర్లు ఇవ్వాలన్నమాట అని అర్ధం చేసుకుని, మనకీ కొన్ని ఆర్డర్లు ఇస్తుంటారు. అవి మనం చెయ్యకపోతే బాగా మారం చేస్తారు. ఏ సంబంధం అయినా పరస్పరమైనదే. మీరు ఏమి ఇస్తారో మీకు అదే లబిస్తుంది. మనం వారికి ఆర్డర్లు ఇవ్వకుండా అభ్యర్ధనలుగా అడిగినప్పుడు వాళ్ళు కూడా మనల్నుంచి గాని, ఇంకేవరినుంచి గాని ఎమన్నా ఆశించినప్పుడు అభ్యర్ధన చేస్తారు. అభ్యర్ధన చేసే గుణం వాళ్ళకి రానున్న రోజుల్లో బాగా ఉపయోగ పడుతుంద. అందువల్ల ఇద్దరిలో ఎవరూ బాస్ అవ్వకూడదు.

పిల్లలు బాగా ఏడుస్తున్న సందర్భాల్లో ఏమి చెయ్యాలి?

పిల్లలు కింద పడినప్పుడో, వాళ్ళని మనం స్కూల్ లో దింపడానికి వెళ్ళినప్పుడో, స్కూల్ గురించి మాట్లాడినప్పుడో, ఒక సారి పడి దెబ్బ తగిలిన చోటుకి మళ్ళి వెళ్ళను అనో, వారికి నచ్చింది ఇవ్వనప్పుడో ఏడుస్తుంటారు. ఇలాంటప్పుడు మనలో చాలా మంది వారి దృష్టి వేరే వైపు మళ్ళించడానికి ప్రయత్నిస్తాం. అలా చెయ్యకూడదు. వాళ్ళు దేన్నీ తలుచుకుని ఏడుస్తున్నారో, దాన్ని ఒక  కధలా అల్లి కారణాలను జోడించి వాళ్ళతో జవాబులు చెప్పిస్తూ కొన్ని సార్లు మళ్ళీ మళ్ళీచెబితే వారికి అలా ఎందుకు అయ్యిందో అర్ధం అవుతుంది అలాగే ఆ విషయం పై వున్న భయం పోతుంది.

పిల్లలు ప్రకోపానికి (పట్ట లేని కోపం) ఎందుకు గురవుతారు, అప్పుడు మీరు ఏమి చెయ్యాలి?

పిల్లల్లో ప్రకోపం రెండు విధాలు గా వుంటుంది - ఒకటి వాళ్ళు కావాలని చేసేది, రెండు వాళ్ళకి తెలియకుండా జరిగేది. వాళ్ళు కావాలని చేసినప్పుడు ఎదో కోరి చేస్తారు, అటువంటప్పుడు మనం వారు కోరింది ఇస్తే వాళ్ళు ఇదే తరహా లో మళ్ళీ చెయ్యడం మొదలు పెడతారు. అందుకు మనం ఈ విషయంలో అస్సలు రాజీ పడకూడదు. వాళ్ళని కూర్చోబెట్టి తను ఏదైతే కోరి ఇలా చేస్తున్నారో అది మీకు అర్ధమవుతుంది అని, వాళ్ళు ఈ విధంగా ప్రవర్తించడం మీకు నచ్చట్లేదు అని, దీని వల్ల వాళ్ళకి నచ్చే విషయాలు వాళ్ళు కోల్పోతారు అని చెప్పాలి. వాళ్ళకి తెలియకుండా జరిగినప్పుడు వాళ్ళని దగ్గరకి తీసుకుని భుజ్జగించాలి. వాళ్ళు ప్రశాంత పడ్డాకే వారి ప్రవర్తన గురించి మాట్లాడాలి. వాళ్ళు ఏ విషయం వల్ల అలా ప్రవర్తించారో, ఆ విషయం లో వారు ఏమి కోరుకుంటున్నారో అడిగి తెలుసుకోవాలి. అలాగే ఒకవేళ వాళ్ళకి నచ్చని పని ఎమన్నా అవుతుంటే దాన్ని ఆపడానికి వాళ్ళు ఎలా వ్యవహరించాలో చెప్పాలి. దీనితో పాటు ఆ నచ్చని పని వాళ్ళకి నచ్చే విదంగా చెయ్యాలంటే ఏం చెయ్యాలో అది కూడా చర్చించాలి. వచ్చే సారి ఆ విధంగానే చెయ్యాలి.

పిల్లల్తో క్లిష్ట పరిస్థితులను ఎలా తప్పించుకోవచ్చు?

పిల్లలకి విసుగు కలిపించే ప్రదేశాలకు, వ్యక్తులకు, పరిస్థుతులకు వాళ్ళని సాధ్యమైనంత వరకు దూరంగా ఉంచాలి. వాళ్ళు వున్నపరిసరాల్లో ఎక్కువ మార్పులు వచ్చినప్పుడు ఇబ్బంది పడుతున్నట్లైతే, ఇకపై ఎక్కువ మార్పులు రాకుండా చూసుకోవాలి. వాళ్లకి ఆకలి వేసినప్పుడో, అలసిపోయినప్పుడో, వంట్లో బాగోలేనప్పుడో ఇబ్బంది పడుతుంటే ఆ పరిస్థుతులు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లలు వారిపై దృష్టి వుండాలి అనేలా ప్రవర్తిస్తుంటే వారిపై ఎక్కువ దృష్టి పెట్టాలి.

పిల్లలు ఒక కొత్త పరిస్థితిని ఎదుర్కునే ముందు వారిని ఎలా దానికి తయారు చెయ్యాలి?

పిల్లల్కి ఎలా ఉండాలో తెలుసులే అని భావించి వదిలేయకూడదు. వారికి సాధ్యమైనంత విస్తృతంగా, స్పష్టంగా చెప్పాలి. వారికి వారు ఎక్కడికి వెళ్తారు, ఎవరి తో వెళ్తారు, ఎలా వెళ్తారు, అక్కడ ఏమేమి వుంటాయి, అక్కడ ఎలా వుండాలి, అక్కడ ఎమన్నా చెయ్యాలి అంటే ఎలా చెయ్యాలి, ఏ క్రమంలో చెయ్యాలి, అక్కడ ఎంతసేపు వుంటారు  మొదలగు విషయాలు అన్నీ సాధ్యమైనంత విస్తృతంగా చెప్పాలి. దీని వల్ల వాళ్ళు మానసికంగా తయారవుతారు, భయం కూడా పోతుంది.

పిల్లల్ని పట్టించుకోకుండా వుండోచ్చా?

పిల్లల్ని సరైనా దారిలో పెంచాలి అంటే కొన్ని సార్లు వారిని పట్టించుకోకూడదు. కొన్ని సార్లు పిల్లలు మన దృష్టి వారిపై మళ్ళించడానికి తప్పుగా ప్రవర్తిస్తారు, అలాంటప్పుడు వారిని పట్టించుకోకూడదు. పట్టించుకుంటే వాళ్ళు ఆ తప్పుడు ప్రవర్తన మళ్ళీ మళ్ళీ చేస్తుంటారు. పట్టించుకోకపోతే వాళ్ళే మెల్లగా ఆ ప్రవర్తనని ఆపేస్తారు. అలాగే మన పిల్లలు దృష్టి కేంద్రీకరించడం కోసం చేసే తప్పుడు ప్రవర్తనలు అన్ని గ్రహించి వారితో రోజు సమయం గడిపే వాళ్ళకి తెలియజేసి పిల్లలు అలా ప్రవర్తించినప్పుడు పట్టించుకోకుండా ఉండేలా చూసుకోవాలి.

పిల్లల్తో గొంతు మార్చి మాట్లాడొచ్చా?

మనం పిల్లల్తో చాలా సార్లు గొంతు మార్చి గాని సాగ దీసి గాని మాట్లాడుతుంటాం - వాళ్ళని ముద్దుగా పిలవడానికో లేక పోతే సరదాగానో. అలా చెయ్యడం వల్ల వాళ్ళు అలాగే మాట్లాడాలేమో అని భావించి, అలాగే మాట్లాడటం మొదలు పెడతారు. ఇది ఒక సారి అలవాటు ఐతే వాళ్ళు మళ్ళీ సాదారణంగా మాట్లాడడానికి చాలా సమయం పట్టొచ్చు. అందుకు మనం ఎవరితో మాట్లాడినా - పిల్లలు అయినా పెద్దవాళ్ళు అయినా ఒకే లాగ మాట్లాడాలి.

పిల్లల్కి గౌరవం ఇస్తున్నామా?

మనలో చాలా మంది పిల్లలు మన చెక్కు చేతల్లో వుండాలని వారిని ఎప్పుడూ మన అదుపు లో ఉంచాలని వారితో గట్టిగా మాట్లాడి బయం తో పెంచుతున్నాం. ప్రతి జీవికి వున్న హక్కు గౌరవించబడటం అలాగే ఎంపిక చేసుకునే అవకాశం. ఉదాహరణకు మనలో కొంత మంది పిల్లల్ని భోజనానికి పిలిసినప్పుడు అరుస్తూ పిలుస్తాం - వస్తున్నావా లేకొపోతే భోజనం వుండదనో, కోప్పడతామనో, కోడతామనో చెబుతాం. అలా కాకుండా గౌరవంగా భోజనానికి రామ్మా అందరం కలిసి తిందాం అని మెల్లగా పిలుస్తూ  నిర్ణయం వారికే వదిలేయండి. దీని వల్ల వాళ్ళు నిర్ణయాలు తీసుకోవడం నేర్చుకుంటారు.

Are we giving respect to our children?

Many of us are parenting our children using fear so that they are always in our control and listen to what we say. Being respected and being offered a choice are rights of each and every being. For example, when we call our children for dinner, many of us call shouting at them and indicating that if they don’t come they wont have food or that we will be scolding them or beating them. Instead of this approach, go to them speak to them gently that you would like to have them for dinner along with other family members, and leave the decision to them. This way they will be come more capable of taking decisions.

Should we make our children responsible?

Being responsible is one key attributes an individual should have. Many times we set a rule for some tasks for our children, like they will be allowed to watch TV only after doing a task. Some times if the child demands, we compromise and make them watch TV without completing the task. Doing like this at times will lead to the child thinking that things come easily and they will lack the responsibility. We should never compromise that way. If we compromise, children will think that saying things and not doing them is fine. So, they will not develop the commitment and moreover they won't become responsible. We can also encourage children to be responsible by encouraging such acts of being responsible and behaving good by giving them stars. Stars is just one suggested method. You can also appreciate by expressing love, giving small gifts. However financial gifts are not recommended for this kind of encouragement.

పిల్లల్కి బాద్యత నేర్పించాలా?

బాద్యతాయుతంగా వుండడం పిల్లల్కి వుండవల్సిన చాలా కీలకమైన గుణం. చాలా సార్లు మనం పిల్లల్కి కొన్ని నిర్దిష్టమైన నియమాలు పెడతాం. ఉదాహరణకు భోజనం చేస్తేనే టీవీ పెడతాం అని, కాని పిల్లలు మారం చేస్తే పర్లేదులే ఒక సారే అని టీవీ ఆన్ చేస్తాం. ఇలా పలు సార్లు చెయ్యడం వల్ల వాళ్ళు అన్నీ సులువుగా వస్తాయిలే అని భావిస్తారు, అలాగే వారిలో బాద్యత కూడా లోపిస్తుంది. ఇలా మనం ఎప్పటికి చెయ్యకూడదు. మనం ఎమన్నా చేస్తాం అంటే అది చేసి తీరాలి. అని మనం చెయ్యకపోతే పిల్లలు కూడా మున్ముందు అలాగే చేస్తారు. కాబట్టి, పిల్లల్తో చర్చించి మనం కొన్ని నిర్ణయాలు తీసుకుని, దానికి కొన్ని నియమాలను ఏర్పరిచినప్పుడు, వాటిని అతిక్రమిస్తే వారికి ఏమైతే లభిస్తుందో అది లబించాకుండా చెయ్యాలి. విధిగా అనుకున్న విదంగా వాళ్ళు పనులు చేసినా మంచి స్వభావం చూపించినా వాళ్ళకి స్టార్స్ లాంటివి ఇచ్చి కూడా బాధ్యతాయుతంగా ఉండడాన్ని ప్రేరేపించొచ్చు. మీరు వారిని ముద్దు చేసి కూడా ప్రేరేపించోచ్చు.